: ఏపీలోనూ టీఆర్ఎస్ శాఖ ప్రారంభించండి... సీఎం కేసీఆర్ కు లేఖ
ఉద్యమపార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదే. అయితే, ఒక్క తెలంగాణకే పరిమితమైన ఆ పార్టీ శాఖను ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రారంభించాలంటూ గుంటూరుకు చెందిన న్యాయవాది రామస్వామిరెడ్డి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన కేసీఆర్ గురించి లేఖలో ప్రశంసించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోందన్నారు.