: వడోదర లోక్ సభకు బీజేపీ అభ్యర్థి ఖరారు
గుజరాత్ లోని వడోదర లోక్ సభ ఉప ఎన్నికకు పోటీ చేసేందుకు బీజేపీ అభ్యర్థిగా రంజన్ బెన్ భట్టా ఖరారయ్యారు. ఈ మేరకు పార్టీ ఆయన పేరును ప్రకటించింది. ఇక్కడి నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచిన మోడీ తర్వాత రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఇటీవలే వడోదర ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసి సెప్టెంబర్ 13న ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది.