: గాజా అథ్లెట్ దయనీయ స్థితి!


ఎటు చూసినా శిథిలాలు, కాంక్రీట్ దిబ్బలు, అక్కడక్కడా రక్తపు మడుగులు... ఇదీ గాజా ప్రస్తుత పరిస్థితి. నెల రోజులుగా ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల ఫలితంగా వీధులు అడ్రెస్ కోల్పోయాయి. ఏ వీధికి ఎటు వెళ్ళాలో అర్థంకాని పరిస్థితి! ఈ నేపథ్యంలో గాజాకు చెందిన ప్రముఖ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ నదీర్ అల్ మస్రీకి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ఈ అథ్లెట్ కు పరుగు ప్రాక్టీసు చేసుకునేందుకు అనువైన స్థలం కరవైందట. ఎక్కడ చూసినా కాంక్రీట్ గుట్టలే కనిపిస్తుండడంతో, ప్రాక్టీసుకు విరామం ప్రకటించక తప్పలేదు. ప్రస్తుతం ఈ యువకుడు ఐక్యరాజ్యసమితి నిర్వహిస్తున్న ఓ పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నాడు. ఇజ్రాయెల్ దాడుల్లో ఈ మారథాన్ రన్నర్ నివాసం కూడా నేలమట్టం అయింది. ఈ 34 ఏళ్ళ యువకుడు తన దుస్థితిపై మాట్లాడుతూ, 33 ఏళ్ళుగా నివసించిన వీధిని ఇప్పుడు గుర్తుపట్టలేకపోతున్నానంటూ ఆవేదన వెలిబుచ్చాడు. పాలస్తీనా జాతీయుడు అన్న కారణంతో అల్ మస్రీని ఇజ్రాయెల్ ఓ మారథాన్ పోటీలో పాల్గొనేందుకు అనుమతి నిరాకరించింది. ఇప్పటివరకు 40 అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్న ఈ గాజా పరుగువీరుడు ఎన్నో ట్రోఫీలు, మెడల్స్ గెలుచుకున్నా, అవన్నీ ఇప్పుడు ఇజ్రాయెల్ దాడుల ఫలితాన శిథిలాల కింద పడిపోయాయి.

  • Loading...

More Telugu News