: ప్రతిపక్షం బతుకే పోడియం అయిపోయింది: బుచ్చయ్య చౌదరి
ఏపీ అసెంబ్లీలో మాటిమాటికీ వైఎస్సార్సీపీ సభ్యులు స్సీకర్ పోడియం వద్దకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తుండడంపై టీడీపీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి సభలో తీవ్రంగా మండిపడ్డారు. తమకు ఎక్కువ సమయం కేటాయించాలంటూ డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష సభ్యుల బతుకే పోడియం అయిపోయిందని విమర్శించారు. వెంటనే స్పీకర్ ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని కోరారు. అటు జగన్ పైన మండిపడ్డ బుచ్చయ్య, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి అసెంబ్లీ ఏమీ ఆయన లోటస్ పాండ్ కాదన్నారు. దివంగత వైఎస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు ఈయనెలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలన్నారు.