: నలుగురు బీజేపీ సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం బీజేపీ సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పించి సత్కరించింది. పార్టీకి విశేష సేవలందించిన నలుగురు సీనియర్ నేతలను గవర్నర్లుగా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర గవర్నర్ గా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత చెన్నమనేని విద్యాసాగరరావును నియమించగా, కర్నాటక గవర్నర్ గా వాజుభాయ్ రుడాభాయ్ ను నియమించారు. గోవా గవర్నర్ గా మృదులాసిన్హాను నియమించారు. రాజస్థాన్ గవర్నర్ గా కల్యాణ్ సింగ్ ను నియమించారు.