: మహారాష్ట్ర గవర్నర్ గా విద్యాసాగర్ రావు
మహారాష్ట్ర గవర్నర్ గా తెలంగాణ బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు నియమితులయ్యారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీహెచ్ విద్యాసాగరరావు బీజేపీలో కీలక పదవులు చేపట్టారు. వాజ్ పేయి మంత్రి వర్గంలో కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. పార్టీలో సీనియర్ అయిన విద్యాసాగరరావును గవర్నర్ గా నియమించి ఆయనకు పార్టీలో సముచిత స్థానం కల్పించారని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆయన సమర్థతపై పలువురు బీజేపీ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాలు భౌగోళికంగా కలిసి ఉండడంతో ఆయనకు మరాఠా సంస్కృతిపై అవగాహన ఉంటుందని నేతలు అభిప్రాయపడ్డారు.