: 'డిజిటల్ ఇండియా ప్రాజెక్టు'పై నేడు మోడీ సమావేశం
ఈరోజు అన్ని రాష్ట్రాల ఐటీ శాఖ మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశం కానున్నారు. మోడీ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 'డిజిటల్ ఇండియా'ను విజయవంతంగా అమలుచేేసే భాగంలో బ్లూప్ల్రింట్ ను సిద్ధంచేసే విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ భేటీలో కేంద్ర కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ మంత్రులతో ప్రధానంగా చర్చలు జరపనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రకటించిన ఈ ప్రాజెక్టు కోసం దాదాపు రూ. లక్ష కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఈ-గవర్నెన్స్, 2019 కల్లా దేశంలోని అన్ని గ్రామాలకు బ్రాడ్ బాండ్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.