: స్పీకర్ మైక్ విరగ్గొట్టిన వైకాపా ఎమ్మెల్యే
ఈ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వైకాపా ఎమ్మెల్యే మణిగాంధీ స్పీకర్ మైకును లాగేశారు. దీంతో, మైక్ విరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే, బడ్జెట్ పై మాట్లాడేందుకు తమ నేతకు మరింత సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... వైకాపా సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఈ సందర్భంలో, మణిగాంధీ మైకును లాగేశారు. ఈ ఘటనపై స్పీకర్ కోడెల అసహనం వ్యక్తం చేశారు. సభామర్యాదలు పాటించడం నేర్చుకోవాలని వైకాపా సభ్యులను కోరారు.