: పదవి నుంచి వైదొలగేందుకు షీలా దీక్షిత్ అంగీకారం
ఎట్టకేలకు కేరళ గవర్నర్ పదవికి రాజీనామా చేసేందుకు షీలా దీక్షిత్ అంగీకరించారు. ఈ మేరకు నిన్న (సోమవారం) రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలసిన ఆమెను రాజీనామా చేసేందుకు ఒప్పించినట్లు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం. రాజ్ నాథ్ తో భేటీ అయినప్పుడు కేవలం పది నిమిషాల్లోనే షీలాను రాజీనామా చేసేలా ఒప్పించారని, ఈ క్రమంలో తన ఆమోదాన్ని పేపర్ రూపంలో తెలియజేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆమె ఎప్పుడు పదవి నుంచి దిగిపోతారా అని ఎదురుచూస్తున్న కేంద్రం ఒకవేళ వెళ్లకుంటే ఏదో ఒక చిన్న రాష్ట్రానికి బదిలీ చేయాలని భావించిందట.