: షిర్డీ సాయి భక్తులు, స్వరూపానంద శిష్యులు కొట్టుకున్నారు!
షిర్డీ సాయి దేవుడు కాదని, ఆయనను ఆరాధించరాదని శంకరాచార్య స్వామి స్వరూపానంద ఎప్పుడైతే వ్యాఖ్యానించారో, అప్పటి నుంచి ఈ అంశం రగులుతూనే ఉంది. తాజాగా, చత్తీస్ గఢ్ లో జరిగిన ఓ ధార్మిక సమ్మేళనంలో ఇదే విషయమై రగడ చెలరేగింది. కవర్థాలో ఈ ధర్మ సంసద్ కార్యక్రమంలో స్వరూపానంద శిష్యులు, సాయిబాబా భక్తులు బాహాబాహీ తలపడ్డారు. సాయి దేవుడు కాదని, గురువు అంతకన్నా కాదని, స్వరూపానందకు తాను మద్దతిస్తానని ఆచార్య నరేంద్ర గిరి పేర్కొనడం ఈ గొడవకు దారితీసింది. కాగా, ఈ సదస్సుకు హాజరుకావాలని స్వరూపానంద షిర్డీ సంస్థాన్ ట్రస్టు పెద్దలకు ఆహ్వానం పంపారు. అయితే, షిర్డీ నుంచి ఈ కార్యక్రమానికి ఎవరూ హాజరుకాలేదు.