: మోడీ జపాన్ పర్యటన బృందంలో ముఖేశ్, ఆదానీ!


ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటన బృందంలో పారిశ్రామిక దిగ్గజాలు ముఖేశ్ అంబానీ, గౌతం ఆదానీలకు చోటు దక్కింది. పారిశ్రామిక సహకారంలో జపాన్ తో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా మోడీ జరుపుతున్న ఈ పర్యటలో ఆయన వెంట అంబానీ, ఆదానీలతో పాటు సన్ ఫార్మా అధితనే దిలీప్ సంఘ్వీ, విప్రో చైర్మన్, ఐసీఐసీఐ ఎండీ చందా కొచ్చార్, ఎస్సార్ యజమాని శశి రుయా, బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా, లార్సన్ టోబ్రో వెంకట రామన్, ఓఎన్జీసీ ఛైర్మన్ షరాఫ్, భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎండీ సునీల్ మిట్టల్ తదితరులు రానున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో కీలక భూమిక పోషిస్తున్న నేపథ్యంలో వీరిని తనతో కలిసి రావాలని మోడీ ఆహ్వానించారు. శనివారం ఈ బృందంతో కలిసి మోడీ జపాన్ బయలుదేరనున్నారు.

  • Loading...

More Telugu News