: సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని మోహరించిన భారత్
పాక్ దురాగతాలకు భారత్ చెక్ చెప్పనుంది. కవ్వింపు చర్యలతో ఎప్పటికప్పుడు కాల్పులకు తెగబడుతున్నా పాకిస్థాన్ కు సరైన బుద్ధి చెప్పేందుకు భారత్ నడుం బిగించింది. సరిహద్దుల్లో భారీ స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. పాక్ దుందుడుకు చర్యలకు పాల్పడితే ఘాటైన సమాధానం చెబుతామని సైనికాధికారులు తెలిపారు. పాక్ ఓ వైపు కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతుంటే చైనా సరిహద్దుల్లో పాగా వేస్తోంది. దీనిని తిప్పికొట్టేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది.