: కొత్త బకెట్ ఛాలెంజ్... దుస్థితి ప్రపంచానికి చాటిన బకెట్ ఛాలెంజ్
ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రిటీలను ఊపేస్తున్న ఐస్ బకెట్ ఛాలెంజ్ ఆదర్శంగా భారత్ లో రైస్ బకెట్ ఛాలెంజ్ మొదలైంది. ఇప్పుడు గాజా దుస్థితిని కళ్లకు కట్టేందుకు జర్నలిస్టు రబల్ బకెట్ ఛాలెంజ్ ను చేపట్టారు. ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిపోతున్న గాజాలో ఎటు చూసినా శ్మశానవైరాగ్యం రాజ్యమేలుతోంది. ఎప్పుడు వచ్చిపడతాయో తెలియని రాకెట్ లతో గాజా శవాలగుట్టగా, శిథిలాల దిబ్బగా మారింది. ఎటూ చూసినా విధ్వంసం దర్శనమిస్తుంది. ఈ దైన్య స్థితిని చూసి చలించిపోయిన రబెల్ మరుభూమిగా మారిన గాజా శిథిలాలను బకెట్ లో తీసుకుని నెత్తిన గుమ్మరించుకున్నారు. దీనిని వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టారు. గాజా దుస్థితిని, పాలస్తీనీయుల ఊచకోతను ప్రపంచానికి చాటేందుకే తానీ రబెల్ బకెట్ ఛాలెంజ్ చేపట్టానని ఆయన తెలిపారు.