: తెలంగాణలో మెడికల్ మేనేజ్ మెంట్, ఎన్నారై కోటాలపై బాదుడే!
తెలంగాణలో మేనేజ్ మెంట్, ఎన్నారై కోటాల్లో చదవాలంటే విద్యార్థుల తల్లిదండ్రులు కోటీశ్వరులు కావాలేమో... ఎందుకంటే, మెడికల్ కళాశాల్లో మేనేజ్ మెంట్, ఎన్నారై కోటాలపై భారీగా ఫీజులు పెంచుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. యాజమాన్య కోటా సీటును 5.50 లక్షల నుంచి అమాంతం 9 లక్షల రూపాయలకు పెంచేసింది. అలాగే ఎన్ఆర్ఐ కోటాలో సీటు కావాలంటే 11 లక్షల రూపాయలు వసూలు చేయనుంది. గతంలో ఈ సీటుకు 5.50 లక్షల రూపాయలు వసూలు చేసేవారు. దీంతో మెడిసిన్ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ర్యాంకులు సంపాదించుకోలేని వారే ఈ రెండు కోటాల్లో జాయిన్ అవుతారు. వారికి ఫీజుల చెల్లింపుపై పెద్దగా అభ్యంతరం ఉండదని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.