: సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా: పీసీ పరేఖ్
బొగ్గు గనుల కేటాయింపులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నానని బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ అన్నారు. 2004-10 మధ్య కేంద్ర బొగ్గుశాఖ మంత్రులను ఈ కుంభకోణంలో బాధ్యులను చేయాలన్న ఆయన, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా బొగ్గుశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని గుర్తుచేశారు. గనుల కేటాయింపులు పొంది, వాటిని అమ్ముకున్న కంపెనీలను కూడా బాధ్యులను చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారులపై నేరాభియోగాలు మోపడం సరికాదని పరేఖ్ తెలిపారు.