: ల్యాండ్ సర్వే మొదలవుతుంది... కరవు ప్రాంతాలను గుర్తిస్తాం: టీఎస్ డిప్యూటీ సీఎం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ల్యాండ్ సర్వే తొందర్లోనే నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. నల్గొండ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, ల్యాండ్ సర్వే నిర్వహించడం కోసం 600 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రాగానే సర్వే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరవు జిల్లాలను గుర్తించి కరవు ప్రభావం ప్రజలపై పడకుండా అడ్డుకునేందుకు సరైన ప్రణాళిక తయారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.