: కేంద్రంతో కయ్యం అవసరమా?: ఎర్రబెల్లి
తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో తకరారు ఎందుకని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, ప్రజల మధ్య ఉన్న భావోద్వేగాలు రెచ్చగొట్టి పరిపాలన చేయడం సరికాదని హితవు పలికారు. చేతనైతే ప్రజల మధ్య సఖ్యత నెలకొనేలా ప్రయత్నించాలని ఆయన పిలుపునిచ్చారు. సొంత జిల్లాలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులను కూడా రాష్ట్ర మంత్రులు పట్టించుకోవడం మానేశారని ఆయన ఆరోపించారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ నేతలు అధికారంలోకి వచ్చాక కొండీలు చెబుతూ పబ్బంగడుపుకుంటున్నారని ఆయన విమర్శించారు.