: ఏపీలో 10 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్: గంటా


ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుభవార్త వినిపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, 10 వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని అన్నారు. సెప్టెంబర్ 5న అన్ని విశ్వవిద్యాలయాల వీసిలతో సమావేశం నిర్వహించనున్నామని, విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఏపీ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని ఆయన తెలిపారు. అసెంబ్లీని ఇడుపులపాయ, పులివెందుల అనుకోవడం జగన్ అవివేకమని చెప్పిన గంటా, వైఎస్ హయాంలోనే హత్యాకాండలు రాజ్యమేలాయని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News