: ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలోని కినారీ బజార్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడున్న పలు దుకాణాలకు మంటలు వ్యాపిస్తున్నట్లు సమాచారం. అటు, ఇరవైఐదు అగ్నిమాపక శకటాలు మంటలార్పుతున్నాయి. కాగా, ఘటనలో ఎవరికీ గాయాలవలేదు. ఢిల్లీలో ఈ ఉదయమే కన్నాట్ ప్రాంతంలో ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.