: కాంగ్రెస్ కార్యకర్తలు తలా వెయ్యి ఇస్తే పేపర్, టీవీ పెడతాం: సురేష్ రెడ్డి
అత్తసొమ్ము అల్లుడి పెత్తనం అంటే ఇదేనేమో! ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తలా 1000 రూపాయలు విరాళంగా ఇస్తే న్యూస్ పేపర్, టీవీ ఛానెల్ పెడతామని కాంగ్రెస్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి సెలవిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ సదస్సులో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి సొంత పత్రిక, టీవీ ఛానెల్ లేకపోవడం వల్లే ఓటమిపాలయ్యామని అన్నారు. అందుకే పార్టీ ఛానెల్, టీవీ పెట్టాలని యోచిస్తున్నామని, అందుకు ప్రతి కార్యకర్త సహకరించాలని ఆయన సూచించారు. కాంగ్రెస్ నేతలంతా సోషల్ మీడియాను వాడుకుని ప్రజలకు చేరువ కావాలని ఆయన సలహాఇచ్చారు.