: హిందీ నేర్చుకునేందుకు గుజరాత్ కు క్యూ కడుతున్న చైనా విద్యార్థులు


భారత్, చైనా దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పలువురు చైనా విద్యార్థులు హిందీ భాష నేర్చుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రం గుజరాత్ కు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పదకొండు మంది విద్యార్థులు అహ్మదాబాద్ లోని 'ఎంటర్ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' ఆధ్వర్యంలో జరుగుతున్న తొమ్మిది నెలల బిజినెస్ హిందీ సర్టిఫికేషన్ కోర్సులో పేర్లు కూడా నమోదు చేసుకున్నారు. వారిలో చైనాలోని యున్నన్ మింజు విశ్వవిద్యాలయానికి చెందిన బిఏ విద్యార్థిని లి చాయ్ లింగ్ (22) మాట్లాడుతూ, ఇండియా, చైనా మధ్య వ్యాపార సంబంధాలు పెరుగుతున్నందువల్లే చైనీస్ విద్యార్థులు హిందీ నేర్చుకునేందుకు దారితీసిందని చెప్పాడు. అయితే, తాను హిందీ టీచర్ కావాలనుకుంటున్నానని "ముజే ఆశా హే కి హింది కి అధ్యాపిక్ బను" అంటూ హిందీలో లీ తెలిపింది. కాగా, భారత్ తో వ్యాపారం చేసే కంపెనీల తరపున హిందీ అనువాదకులుగా పని చేయాలని కొంతమంది అనుకుంటుంటే... చైనీస్ పాఠశాలలు, కళాశాలల్లో టీచర్లుగా పనిచేయాలని మరికొంతమంది కోరుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే పారిశ్రామికవేత్తలుగా ఇండియన్ కంపెనీలతో వ్యాపారం చేయాలని ఆశపడుతున్నారు.

  • Loading...

More Telugu News