: హెల్మెట్ ధరించి ర్యాంప్ వాక్ చేసిన యువీ


క్రికెటర్లలో యువరాజ్ సింగ్ స్టయిలే వేరు! అటు క్రికెట్ ప్రపంచానికి, ఇటు మోడలింగ్ రంగానికి సుపరిచితుడీ డాషింగ్ ఆల్ రౌండర్. మ్యాచ్ లు లేనప్పుడు ఫొటో షూట్లు, ర్యాంప్ వాక్ లతో ఈ పంజాబీ స్మార్ట్ బాయ్ బిజీబిజీగా ఉంటాడు. తాజాగా, లాక్మే ఫ్యాషన్ వీక్ లోనూ తనదైన శైలిలో తళుక్కుమన్నాడు. పేరొందిన డిజైనర్ అర్జున్ ఖన్నా రూపొందించిన తెల్లని దుస్తుల్లో యువీ రాజకుమారుణ్ణి తలపించడం విశేషం. యాక్సెసరీగా చేతిలో ఓ హెల్మెట్... పక్కన బాడీగార్డుల తరహాలో ఇతర మోడల్స్..! ఈ తరహా సెట్టింగ్ తో యువీ చుక్కల్లో చంద్రుడల్లే మెరిసిపోయాడట. ఈ ఫ్యాషన్ షోలో బాలీవుడ్ తారలు నర్గీస్ ఫక్రీ, శృతి హాసన్, నేహా ధూపియా తదితరులు కూడా ర్యాంప్ పై హొయలు ఒలికించారు. దీనిపై యువీ స్పందిస్తూ, అద్భుతంగా ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News