: వైయస్ హయాంలో జగన్ అస్తులు అభివృద్ధి చెందాయి కానీ... ప్రజలు కాదు: కాల్వ
తన తండ్రి హయాంలో రాష్ట్రం, ప్రజలు అద్భుతంగా అభివృద్ధి చెందారని జగన్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు. నిజంగా అభివృద్ధి చెందింది జగనే అని... అతని ఆస్తులు లక్షల రూపాయల నుంచి 44 వేల కోట్లకు పెరిగాయని అన్నారు. ఈ వివరాలను సీబీఐ కూడా చెప్పిందని తెలిపారు. తప్పుడు లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా కాల్వ ఈ వ్యాఖ్యలు చేశారు.