: లక్ష కోట్లు ఎలా దోచుకోవాలో జగన్ మాకు ట్యూషన్ చెబుతారా?: ధూళిపాళ్ల నరేంద్ర
'ట్యూషన్ చెబుతున్నా నేర్చుకోండయ్యా' అని టీడీపీ సభ్యులను ఉద్దేశించి జగన్ చేసిన వ్యాఖ్యలపై ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. అతి తక్కువ కాలంలో లక్ష కోట్లు ఎలా దోచుకోవాలో జగన్ ట్యూషన్ చెబుతారా? దళితుల భూములు కూడా ఎలా ఆక్రమించుకోవాలో చెబుతారా? ఆర్థిక నేరాలు ఎలా చేయాలో ట్యూషన్ చెబుతారా? అని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర జగన్ పై విరుచుకుపడ్డారు. రుణమాఫీని వ్యతిరేకించిన జగన్ కు అసెంబ్లీలో మాట్లాడే అర్హత లేదన్నారు. తండ్రి హయాంలో జగన్ అడ్డగోలుగా సంపాదించాడని ఆరోపించారు.