: ఏపీ, తెలంగాణలకు 'పన్ను రాయితీ'ని వ్యతిరేకించిన జయ


దక్షిణాదిన కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 'ప్రాంతీయ ఆధారిత పన్ను రాయితీ'ని కేంద్రం ఇవ్వనుండడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు కొన్ని వర్గాల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఆమె లేఖ రాశారు. ఆ రెండు రాష్ట్రాలకు ఇవ్వాలనుకున్న పన్ను రాయితీ వల్ల పక్క రాష్ట్రాల నుంచి భారీ పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తరలివెళ్లే అవకాశం ఉందని తెలిపారు. "పన్ను రాయితీలు పొరుగు రాష్ట్రాలను పూర్తిగా పోటీపడలేనివిగా చేస్తాయి. కొత్త పరిశ్రమలకు అటువంటి రాయితీల వల్ల ప్రస్తుత పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. ఈ పరిస్థితి పొరుగు రాష్ట్రాల్లోనూ, అలాంటి రాయితీ కల్పించిన ప్రాంతాల్లోనూ ఎదురవుతుంది. ఇది పూర్తిగా సమర్థించలేనిది. ఇలాంటి భయంకరమైన ప్రమాదాలను విస్మరించకూడదు" అని పేర్కొన్నారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్తలను తీసుకోవాలని జయ మోడీని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News