: లారీలో ఇసుక వేస్తే లాకప్ కే... దిక్కుతోచని స్థితిలో ఇసుక మాఫియా


ఇసుక మాఫియాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇన్నాళ్లు అడ్డూఅదుపూ లేకుండా కొనసాగిన అక్రమార్కుల చర్యలకు అడ్డుకట్ట వేసింది. "లారీలో ఇసుక వేసిన వారిని డైరెక్ట్ గా లాకప్ లోకి తోసేయండి" అంటూ ఏపీ డీజీపీ జేవీ రాముడు అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఇసుక లోడ్ తో రోడ్డెక్కడానికి మాఫియాగాళ్ల గుండెలు గుభేల్ మంటున్నాయి. ముఖ్యంగా సీమ జిల్లాల్లో దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసేస్తున్నారు.

  • Loading...

More Telugu News