: జాతీయ స్థాయి మహిళా షూటర్ పై మత మార్పిడి వేధింపులు
తారా షాదియో. జాతీయ స్థాయిలో పేరుగాంచిన మహిళా షూటర్. షూటింగ్ లో గురితప్పని తారా, హిందువునంటూ అబద్ధమాడిన రకీబుల్ హసన్ ఖాన్ నిజ నైజాన్ని పసిగట్టలేపోయారు. రంజిత్ కుమార్ కోహ్లీ పేరిట పరిచయమైన అతడిని పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తర్వాత కాని అతడి నిజ స్వరూపం తారాకు తెలిసి రాలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మొన్నటి రంజాన్ సందర్భంగా కోహ్లీ అసలు హిందువు కాదని, ముస్లిం అని తెలిసిన తారా షాక్ కు గురయ్యారు. మతం వేరైతే ఏముందిలే అనుకున్న ఆమెపై, కోహ్లీ అలియాస్ ఖాన్, ఇస్లాం స్వీకరించాల్సిందేనని ఒత్తిడి చేశాడు. నిరాకరించిన తారాపై చేయి చేసుకున్నాడు. ఇంట్లోనే బందీని చేశాడు. దిక్కుతోచని స్థితో చిక్కుకున్న తారా నెల రోజుల పాటు ఖాన్ వేధింపులను భరించక తప్పలేదు. ఇటీవల అతడు ఢిల్లీ వెళ్లిన సమయంలో బంధువులకు సమాచారం అందించగలిగిన తారా, ఎట్టకేలకు బటయపడగలిగారు. దీనిపై ఫిర్యాదునందుకున్న రాంచీ పోలీసులు ఖాన్ కోసం గాలింపు మొదలుపెట్టారు. మరోవైపు మతం మార్చుకోవాంటూ వేధింపులకు గురి చేసిన ఖాన్, అతడి కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే, ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని విశ్వహిందూ పరిషత్ లాంటి సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.