: చౌకగా స్మార్ట్ ఫోన్లు భారత్ లోనే దొరుకుతాయి
స్మార్ట్ ఫోన్... సాంకేతిక విప్లవంలో కొత్త పుంతలు తొక్కుతున్న సాధనం. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చేతిలో ప్రపంచం ఇమిడిపోయినట్టే. అలాంటి స్మార్ట్‌ఫోన్ల దిగుమతి రానురాను తగ్గిపోతోంది. అత్యంత చౌకగా భారత్లోనే స్మార్ట్‌ఫోన్లు లభ్యమవుతున్నాయి, కాగా, స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోవడంతో, పలు కంపెనీలు తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తున్నాయి. దీంతో ఆ ప్రభావం దిగుమతులపై పడింది. ఫైర్‌ఫాక్స్ స్మార్ట్‌ఫోన్ ఈ నెల 29న భారత్లో లాంఛ్ కానుండడంతో పోటీ మరింత పెరుగుతోంది. ఇంటెక్స్, స్పైస్ సంస్థలు భారతీయ మార్కెట్ లో ఫైర్‌ఫాక్స్ ఫోన్‌ను విడుదల చేయనున్నాయి. దీని ధర కేవలం 2,229 రూపాయలు ఉంటుందని ఆ సంస్థ తెలిపింది.