: మంత్రి నారాయణకు స్వల్ప అస్వస్థత


ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో కలిసి నెల్లూరులోని స్వర్ణభారతి ట్రస్టు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి నారాయణ, తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి వెంట రోడ్డు మార్గంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడితో పాటు హైదరాబాద్ చేరుకునేందుకు బయల్దేరారు. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే మంత్రి నారాయణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా రేణిగుంట విమానాశ్రయంలో దించారు. విమానాశ్రయం అధికారులు ఆయనకు విమానాశ్రయంలో చికిత్స ఏర్పాటు చేశారు. వైద్యులు ఆయనను పరీక్షిస్తున్నారు.

  • Loading...

More Telugu News