: నేను సింగిల్ టేక్ ఆర్టిస్టునే... ముద్దుసీన్లకే రీటేక్ లు తీసుకుంటా: ఇమ్రాన్ హష్మీ


సాధారణంగా తాను షూటింగ్ లో సీన్లన్నీ సింగిల్ టేక్ లోనే పూర్తి చేస్తానని బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ తెలిపాడు. 'కామెడీ నైట్స్ విత్ కపిల్' షోలో పాల్గొన్న ఇమ్రాన్ హష్మీ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. డైరెక్టర్ వివరించినట్టు సీన్లన్నీ సింగిల్ టేక్ లోనే పూర్తి చేస్తానని... ముద్దు సీన్లలో మాత్రం రీ టేక్ లు తీసుకుంటానని హష్మీ వెల్లడించాడు. ఇంతకీ త్వరలో విడుదల కానున్న 'నట్వర్ లాల్ 420' సినిమాలో ఎన్ని ముద్దు సీన్లు ఉంటాయని అడిగితే 'సినిమాలో చూపించినవా? తాము నటించినవా?' అని ఎదురు ప్రశ్నించాడు. ప్రేక్షకులు నవ్వుల పువ్వులు పూయించడంతో, మూడు ముద్దు సీన్లు ఉన్నాయని తెలిపాడు. కాగా ఈ సినిమాలో నటించిన పాకిస్థాన్ నటి హుమైమా తాను బయట సిగ్గుపడుతూ ఉండే దానినని, ఇమ్రాన్ హష్మీతో నటించిన తరువాత సిగ్గుపోయిందని ముక్తాయించింది.

  • Loading...

More Telugu News