: రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవాలి: కిషన్ రెడ్డి
రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వర్షాలు లేకపోవడం వల్ల పంటపొలాలు ఎండిపోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రైతుల ప్రాధాన్యత అంశాలను ప్రభుత్వం పట్టించుకోవాలని అన్నారు. రైతు రుణమాఫీ పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్నారు. రుణాల రీషెడ్యూలుకు సంబంధించి ఎప్పటిలోగా రైతులు తమ రుణాలను చెల్లించవచ్చో వారికి తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు.