: తప్పు తెలుసుకున్నామంటున్న దానం
కాంగ్రెస్ మేధోమథనం సదస్సు సందర్భంగా సీనియర్ నేత దానం నాగేందర్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సే అయినా, నేతల మధ్య సమన్వయలోపం ఎన్నికల్లో ఓటమికి కారణమైందని అభిప్రాయపడ్డారు. తమ తప్పు తెలుసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇకపై పార్టీ బలోపేతానికి శ్రమిస్తామని తెలిపారు. పనిలోపనిగా టీఆర్ఆస్ పై ధ్వజమెత్తారు దానం. ఆ పార్టీ పగటికలలు కనడం మానుకోవాలని హితవు పలికారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పరిస్థితి భిన్నంగా ఉంటుందని హెచ్చరించారు.