: డ్రంకన్ డ్రైవ్ లో దొరికిన సినీ రచయిత


హైదరాబాదులో మద్యం తాగి వాహనం నడుపుతూ సినీ రంగానికి చెందిన ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం అర్థరాత్రి తనిఖీలు నిర్వహిస్తున్న బంజారాహిల్స్ పోలీసులకు రచయిత మధు, జూనియర్ ఆర్టిస్టు అజయ్ దొరికిపోయారు. బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించిన అనంతరం వారిపై పోలీసులు డ్రంకన్ డ్రైవ్ కేసును నమోదు చేశారు. వారాంతాల్లో హైదరాబాదు రోడ్లపై పోలీసులు క్రమం తప్పకుండా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News