: సెప్టెంబర్ 5న చిన్నారులు, టీచర్లతో ముచ్చటించనున్న మోడీ
ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఎన్డీయే ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ 5న నరేంద్ర మోడీ చిన్నారులు, టీచర్లతో ముచ్చటిస్తారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లైవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసారం చేసే అవకాశాలున్నాయి. దేశంలో పాఠశాల విద్య తీరుతెన్నులను తెలుసుకోవడానికి ఇదో అవకాశంగా మోడీ భావిస్తున్నారు.