: భర్త 'మగబుద్ధి'కి బహుమతి ఇచ్చిన భార్య


పరాయి మహిళలతో చాటుమాటుగా సరసాలాడుతూ మగబుద్ధి చాటుకున్న భర్తకు ఆ భార్య పోలీసు సంకెళ్లను బహుమతిగా ఇచ్చేసింది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరులో చోటుచేసుకున్న ఈ ఘటనలో సదరు భార్యామణి నిఘా నేత్రానికి పట్టుబడ్డ భర్తగారు నేరుగా కటకటాల వెనక్కెళ్లిపోయారు. జిల్లా పంచాయతీ సభ్యురాలైన సుధా పటేల్, భర్త సురేశ్ పటేల్ తీరులో మార్పును పసిగట్టి ఆరా తీసింది. తన అనుమానం నిజమేనని రూఢీ చేసుకుంది. ఇంకేముంది, పోలీసులతో బయలుదేరింది. పరాయి మహిళతో కామకేళీలో మునిగిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టేసింది. పది మంది ముందే చీవాట్లు పెట్టింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన పోలీసులు భర్తగారిని స్టేషనుకు తరలించారు. పరాయి మహిళతో కులుకుతున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సుధా పటేల్, మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీలో మహిళా నేతగా రాణిస్తున్నారు.

  • Loading...

More Telugu News