: జీపీఎస్ కు పోటీగా ప్రయోగించిన 'గెలీలియో' ఉపగ్రహాలు దారితప్పాయి!


జీపీఎస్ వ్యవస్థకు పోటీ వ్యవస్థగా పేరుగాంచింది గెలీలియో నావిగేషన్ సిస్టమ్. ఈ వ్యవస్థ కోసం ఉద్దేశించిన డోర్సియా, మిలెనా అనే రెండు శాటిలైట్లను కిందటి శుక్రవారం రోదసిలోకి పంపారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ స్పేస్ సెంటర్ నుంచి రష్యన్ తయారీ సోయుజ్ వీఎస్09 రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించారు. అయితే, రష్యన్ రాకెట్ ఈ రెండు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్య కంటే కొద్దిగా కింద ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టడంతో సమస్య ఉత్పన్నమైంది. ఈ రాకెట్ లాంచింగ్ ప్రాజెక్టు నిర్వాహక సంస్థ ఏరియన్ స్పేస్ దీనిపై స్పందిస్తూ, పరిస్థితిపై విచారణ జరుపుతున్నామని పేర్కొంది. గెలీలియో ఫ్రాన్స్ కో-ఆర్డినేటర్ జీన్ ఈవ్స్ లీ గాల్ మాట్లాడుతూ, ఈ రెండు ఉపగ్రహాల కక్ష్యను సరిదిద్దడం చాలా క్లిష్టం అని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కాగా, రెండు శాటిలైట్లు కూడా పనితీరు పరంగా సవ్యరీతిలో స్పందిస్తున్నాయని జర్మనీలోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కేంద్రం తెలిపింది.

  • Loading...

More Telugu News