: ‘బిగ్ బజార్’ దొంగలు దొరికిపోయారు
కృష్ణాజిల్లా నందిగామలో ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులోని కాచిగూడ బిగ్ బజార్ షాపింగ్ మాల్ లో దోపిడీ చేసి తప్పించుకున్న ఈ చోరులు... పోలీసుల చేతికి చిక్కారు. నిందితుల నుంచి రూ.50 లక్షల విలువైన ల్యాప్ టాప్ లు, కెమెరాలు, ఐఫోన్ తదితర ఎలక్ట్రానిక్ ఉపకరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. వీరు ఆర్టీసీ బస్సులో వెళుతుండగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.