: కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ పార్టీని వీడరు: ఆజాద్


కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ పార్టీని వీడరని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ గులాం నబీ ఆజాద్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన ఢిల్లీలో నేడు మీడియాతో మాట్లాడారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో రేపు జరిగే సమావేశంలో ప్రధానంగా పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ పనితీరుపై సమీక్షిస్తామని ఆజాద్ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం కిరణ్ కూడా పాల్గొంటారని ఆయన తెలిపారు. ఇక సీబీఐ ఛార్జిషీటులో పేర్లున్న మంత్రులపై కోర్టు నిర్ణయం పరిశీలించాకే చర్యలు ఉంటాయని చెప్పారు.

  • Loading...

More Telugu News