: కోహ్లీతో పెళ్ళికి సమయముంది, అవన్నీ పుకార్లేనంటున్న అనుష్క
టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మ తాను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నట్టు వచ్చిన వార్తలను ఖండించింది. కోహ్లీతో పెళ్ళికి ఇంకా టైముందని, అవన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేసింది. ఇటీవలే ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ సందర్భంగా కోహ్లీని కలిసేందుకు బీసీసీఐ అనుష్కకు అనుమతి ఇచ్చింది. దీంతో, ఈ ప్రేమికులిరువురు ఒకే హోటల్లో బస చేశారు. అప్పటినుంచీ వీరి పెళ్ళి వార్తలు ఊపందుకున్నాయి. దీనిపై, అనుష్క శర్మ ప్రతినిధి మీడియాకు వివరణ ఇచ్చారు. అనుష్క శర్మ పెళ్ళి గురించి ఆన్ లైన్ లో అనేక వార్తలొస్తున్నాయని, వాటిలో నిజంలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలకు అడ్డుకట్ట వేయాలని ఆ ప్రతినిధి మీడియాను అభ్యర్థించారు.