: నా సినిమాలు పండుగలకు రిలీజ్ చెయ్యను, నా సినిమా రిలీజే ఓ పండుగ: షారూఖ్ ఖాన్


బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఏమంటున్నాడో వినండి. తన సినిమాలను పండుగలకు విడుదల చెయ్యనని, తన సినిమా విడుదలే ఓ పండుగ అని ధీమాగా చెబుతున్నాడు. తన చిత్రాలు కొన్ని పర్వదినాల సందర్భంగా రిలీజవడం పట్ల మాట్లాడుతూ, అలా విడుదల చేయడాన్ని తాను వ్యతిరేకిస్తానని అన్నాడు. అయినా, సినిమాలు విడుదల చేయడం నిర్మాతల ఇష్టంపై ఆధారపడి ఉంటుందని, అది తన పని కాదని అభిప్రాయపడ్డాడు. అయితే, తన సినిమా విడుదల అయితే అదో పండుగ అవుతుందని పేర్కొన్నాడు. సహజంగా ఈద్ రోజున నమాజ్ చదువుతారని, దీపావళి నాడు పూజలు చేస్తారని చెబుతూ, ఇప్పుడందరూ పండుగనాడు సినిమా విడుదల గురించి మాట్లాడుకోవడం కొత్తగా అనిపిస్తోందని అన్నాడు.

  • Loading...

More Telugu News