: కోచింగ్ స్టాఫ్ ను వన్డే సిరీస్ తర్వాతే మార్చాలి: ద్రావిడ్
ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు సన్నద్ధమవుతున్న టీమిండియా జట్టుకు సంబంధించి మార్పులు చేర్పులకు ఇది సమయం కాదంటున్నాడు బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్. సిరీస్ ముగిసిన తర్వాతే సహాయక సిబ్బందిని మార్చే అంశం పరిశీలించి ఉండాల్సిందని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. భారత జట్టు కోచింగ్ డైరక్టర్ గా రవిశాస్త్రిని నియమించడంపై వ్యాఖ్యానిస్తూ ద్రావిడ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.