: పోలీసు అధికారి ఇంటివద్ద బాంబు కలకలం
ఒడిశాలోని మాచ్ ఖండ్ వద్ద బాంబు కలకలం రేగింది. పోలీసు అధికారి విజయ్ కుమార్ ఇంటివద్ద బాంబు ఉందన్న సమాచారంతో అక్కడి వారిలో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం విజయ్ కుమార్ నివాసం వద్ద భారీగా బీఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.