: జగన్ ఓ ఉత్తరకుమారుడు: ఎమ్మెల్యే ధూళిపాళ్ళ
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనో ఉత్తరకుమారుడని వ్యాఖ్యానించారు. యుద్ధం నుంచి వెనుదిరిగిన ఉత్తర కుమారుడిలా సభ నుంచి జగన్ పారిపోయారన్నారు. అలాంటి వ్యక్తితో ఎంతకాలం ఉంటారో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించుకోవాలన్నారు. కాగా, ఇవాళ జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో జగన్ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు. అందుకు జగన్ అటు వైపు నుంచి ఆవేశంగా మాట్లాడారు. కొద్దిసేపటికి పార్టీ ఎమ్మెల్యేలతో కలసి సభ నుంచి వాకౌట్ చేయడం తెలిసిందే.