: శ్రీలంక తమిళులకు తప్పకుండా న్యాయం చేయాలి: ప్రధాని మోడీ
అత్యల్ప సంఖ్యలో శ్రీలంకలో ఉన్న తమిళులకు సమానత్వం, న్యాయం, స్వీయ గౌరవం ఇచ్చేలా హామీ ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోరారు. ఈ మేరకు తమిళ నేషనల్ అలయెన్స్ పార్టీకి (లంకలో ప్రధాన పార్టీ) చెందిన ఆరుగురు సభ్యుల బృందం ఈ రోజు తనను కలిసిన సమయంలో ప్రధాని పైవిధంగా తెలిపారు. "లంకలో ఉంటున్న తమిళ వర్గానికి చెందిన వారి సమస్యలకు రాజకీయ పరిష్కారం అవసరమని ప్రధాని చెప్పారు. దీనివల్ల తమిళులకు సమానత్వం సాధ్యమవుతుంది" అని ఓ అధికారి అనంతరం తెలిపారు.