: టీమిండియాకు 'పెద్దన్నయ్య' వచ్చాడు!
టీమిండియాకు కోచింగ్ డైరక్టర్ గా నియమితుడైన రవిశాస్త్రి జట్టులో తన పాత్ర తీరుతెన్నులపై వివరణ ఇచ్చారు. తాను జట్టుకు 'పెద్దన్నయ్య' లాంటి వాణ్ణని పేర్కొన్నారు. ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ సందర్భంగా జట్టులో సానుకూల దృక్పథాన్ని చొప్పించడమే తన విధి అని స్పష్టం చేశారు. జట్టు శిక్షణ బాధ్యతలు ప్రధాన కోచ్ డంకన్ ఫ్లెచర్ చూసుకుంటారని తెలిపారు. ఆటగాళ్ళలో ప్రతిభకు లోటులేదని, వారి మనసులను స్వచ్ఛంగా ఉంచడంపై దృష్టిపెడతానని పేర్కొన్నారు.