: స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం అంశంపై వైసీపీలో భిన్నాభిప్రాయాలు


అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో అసెంబ్లీలోని తన ఛాంబర్ లో జగన్ సమావేశమై సభాపతి విషయంపై చర్చించారు. ఇంతలోనే స్పీకర్ పై తీర్మానం పెట్టడం తొందరపాటు చర్య అవుతుందని చెప్పారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ఆలోచనను ఆయన విరమించుకున్నారు. ఈరోజు జరిగిన సభలో తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ జగన్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News