: శాసనసభ ఎదుట ఆందోళనకు దిగిన జగన్
తన పార్టీ ఎమ్మెల్యేలతో కలసి వైకాపా అధినేత జగన్ శాసనసభ ఎదుట ఆందోళనకు దిగారు. నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. అధికార పక్షానికి స్పీకర్ వత్తాసు పలుకుతున్నారని... ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, గత మూడు నెలల్లో జరిగిన రాజకీయ హత్యలపై చర్చిద్దామంటే... పదేళ్ల క్రితం జరిగిన ఘటనలపై చర్చిస్తున్నారని అన్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటికి వచ్చినట్టు అన్నీ అసత్యాలే చెబుతున్నారని ఆరోపించారు. అబద్దాలు చెబుతున్నారని తెలిసినా... ఆయనను స్పీకర్ వారించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. స్పీకర్ వైఖరికి నిరసనగా ఈ రోజు అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిపారు.