: యూపీఎస్సీ అభ్యర్థులకు సుప్రీంలో ఎదురుదెబ్బ


రేపు జరగనున్న సివిల్స్ ప్రాథమిక పరీక్ష నిలిపివేసేలా స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన యూపీఎస్సీ అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు పరీక్ష వాయిదా కోరుతూ పిటిషన్ రూపంలో చేసిన విఙ్ఞప్తిని జస్టిస్ జగదీష్ సింగ్ ఖేర్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది. తొమ్మిది లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు సిద్ధంగా ఉన్నందున ఇప్పుడు వాయిదా వేయలేమని సుప్రీం స్పష్టం చేసింది. కొంతమంది కోసం 9 లక్షల మందికి అన్యాయం చేయలేమని తెలిపింది. మే నుంచి ఇప్పటివరకు పరీక్షకు సమయం సరిపోతుందని పేర్కొంది. సీశాట్ (సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూట్ టెస్ట్)లో ఈ ఏడాది కొత్తగా ఆంగ్ల భాష సెక్షన్ ను యూపీఎస్సీ తీసుకొచ్చింది. దీనివల్ల హిందీ నేపథ్యం ఉన్న అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ పరీక్షను రద్దు చేయాలని గత నెలలో అభ్యర్థులు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News