: పులివెందుల నుంచి విశాఖ వరకు వైఎస్ అనుచరులు భూకబ్జాలకు పాల్పడ్డారు: గోరంట్ల
శాంతిభద్రతలపై స్వల్పకాలిక చర్చ మళ్లీ ప్రారంభమైంది. వెంటనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శాసనసభలో వైసీపీపై విరుచుకుపడ్డారు. పులివెందుల నుంచి విశాఖ వరకు వైఎస్ అనుచరులు భూకబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందు జరిగిన హత్యలను కూడా ఆయనకు ఆపాదిస్తున్నారని ఆరోపించారు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చెలరేగాయని గోరంట్ల అన్నారు. తాను నిన్న ప్రసంగించినప్పుడు జగన్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆయన అన్నారు.