: రాజమండ్రి ఎయిర్ పోర్టుకు టంగుటూరి ప్రకాశం పంతులు పేరు: సభలో చంద్రబాబు
శాసససభలో నేడు టంగుటూరి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దేశానికి టంగుటూరి చేసిన సేవలకు గుర్తింపుగా... ఆంధ్రకేసరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించామని ఆయన తెలిపారు. తెలుగు జాతి గర్వించదగిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు అని ఆయన అన్నారు. టంగుటూరి పంతులు తన సంపాదన మొత్తాన్ని దేశానికే సమర్పించారని ప్రశంసించారు. అప్పట్లో మోతీలాల్ నెహ్రూ కన్నా ఎక్కువగా లాయర్ ఫీజును టంగుటూరు తీసుకునేవారని తెలిపారు. టంగుటూరి ఎప్పుడూ పదవుల కోసం పాకులాడలేదని... పదవులే ఆయనను వెత్తుక్కుంటూ వచ్చి వరించాయని తెలిపారు. దేశంతో పాటు ఆంధ్రరాష్ట్రానికి చేసిన సేవకు గానూ... రాజమండ్రి ఎయిర్ పోర్టుకు ప్రకాశం పంతులు పేరు పెట్టాలని యోచిస్తున్నామని... అలాగే నూతన రాజధానిలో ఏర్పడబోయే ఎయిమ్స్ సంస్థకు కూడా టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టాలనుకుంటున్నామని ఆయన తెలిపారు.